Niharika Konidela: పెళ్లి తర్వాత నిహారిక కొత్త ప్రయత్నం

నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లి తరువాత తన యాక్టింగ్ కెరీర్‌ని కొనసాగిస్తుందా లేదా అని పెళ్ళికి ముందే అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియా రకరకాల చర్చలు జరిగాయి. సీన్ కట్ చేస్తే మెగా వారింట్లో నిహారిక పెళ్లి సందడి ముగిసిన నెలలోపే ఆమె మళ్ళీ తన ప్రొఫెషన్‌పై దృష్టి సారించింది.

  • Jan 08, 2021, 22:16 PM IST

నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లి తరువాత తన యాక్టింగ్ కెరీర్‌ని కొనసాగిస్తుందా లేదా అని పెళ్ళికి ముందే అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియా రకరకాల చర్చలు జరిగాయి. సీన్ కట్ చేస్తే మెగా వారింట్లో నిహారిక పెళ్లి సందడి ముగిసిన నెలలోపే ఆమె మళ్ళీ తన ప్రొఫెషన్‌పై దృష్టి సారించింది. మీడియాలో వస్తున్న కథనాలకు చెక్ పెడుతూ వివాహానంతరం తన నటన కొనసాగించాలని నిహారిక నిర్ణయించింది. హనీమూన్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ముగించుకొని "లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్" అంటూ సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేసింది.

1 /4

భాను రాయుడు రచన, దర్శకత్వంలో వెబ్ సిరీస్‌కి సైన్ చేసిన నిహారిక తాజాగా ఆ వెబ్ సిరీస్‌ని పట్టాలెక్కించే పనిలో పడింది. అందులో భాగంగానే తాజాగా ఈ వెబ్ సీరీస్‌కి సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది.

2 /4

ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవానికి నిహారిక భర్త చైతన్య జోన్నలగడ్డ కూడా హాజరయ్యాడు. ఈ వెబ్ డ్రామాలో టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనుంది.

3 /4

నిహారిక కొణిదెల వివాహం ( Niharika Konidela wedding ) డిసెంబర్ 9న ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్‌లో సమీప బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మెగా ఫ్యామిలితో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న అనంతరం కొత్త జంట హనీమూన్‌ కోసం మాల్దీవ్స్‌కి వెళ్లొచ్చారు.

4 /4

అయితే నిహారిక వెబ్ సీరీస్‌లతోనే సరిపెట్టుకుంటుందా లేక సినిమాలలో కూడా నటిస్తుందా అనేది ప్రస్తుతానికి వేచిచూడాల్సిన అంశమే అవుతుందంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.